సోమవారం, డిసెంబర్ 21, 2015

ఒక పూవు పూసిన మరుక్షణం






విరితావికీ
చిరుగాలికీ
విడదీయరాని బంధము
అరుదైనది ఆ స్నేహము

ఒక పూవు పూసిన మరుక్షణం
విరితావి  ఎగసిన తక్షణం
చిరుగాలి అచటికి వచ్చును
సరదాల ఊయల లూపును

అల్లరి చిరుగాలి కదిలేను
మెల్లగ మధుపాన్ని చేరేను
చల్లగ శుభవార్త చెప్పేను
నల్లాడు రివ్వున వచ్చేను

అరుదెంచిన భ్రమరానికి
దొరికేను తేనె విందులు
విరికన్నియ భాగ్యానికి
చిరుగాలి వేయు చిందులు





4 కామెంట్‌లు:

  1. నల్లాడు రివ్వున వచ్చేను ?

    రిప్లయితొలగించండి
  2. జనం మనుషులకి గుర్తులుగా పేర్లు పెడుతూ‌ ఉండరండీ? ఎఱ్ఱోడు, బక్కోడు, తెల్లాడు నల్లాడు అంటూ. అలాగన్న మాట. ఇక్కడ నల్లాడు అంటే ఎవరో తెలిసిం దనుకుంటానండీ.

    మీరు పాతకాలం‌నాటి షావుకారు సినిమా చాసారాండీ? అందులో ఆ సినీమాతో‌ నటీమణి జానకిగారు షావుకారు జానకి ఐపోయారు గదండీ. ఆ సినిమా అన్నమాట. అందులో ఒక డైలాగుంది. హీరో రామారావు గారు షావుకారు జానకి అన్న కొడుకుని 'నల్లాడు' అంటాడు పరాచికానికి. ఆమెకు ఉక్రోషం వచ్చి, 'నల్లాడైతే అయ్యాడులే, నీ కూతుర్నేమీ ఇవ్వద్దులే' అని అంటుంది. గుర్తుందాండీ ఆ సినిమా?

    రిప్లయితొలగించండి
  3. రోజ్ రోజ్ రోజాపువ్వా. పువ్వా పువ్వా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు ఆ పువ్వు లంటే యిష్ట మన్నమాట. బాగుంది బాగుంది.

      తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?