ఆదివారం, డిసెంబర్ 27, 2015

తెలతెలవారే చల్లని వేళ ఒక మందారం వికసించినది


తెలతెలవారే
చల్లని వేళ
బిలబిలాక్షుల
గడబిడ వేళ
తలుపులు తెరచి
ఇలు వాకిళుల
లలనలు ముగ్గులు
పరచే  వేళ




ఒక ఊరిలో
ఒక వాడలో
ఒక తోటలో
ఒక మూలన
ఒక కొమ్మపై
ఒక రెమ్మపై
ఒక మందారం
వికసించినది

ఆ పూవుదే
ఆ అందమూ
ఆనందమూ
ఆర్భాటమూ
ఆ తోటలో
ఆ పూవుతో
అ ఆమని
అరుదెంచినది


5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ. పూలతీగ పాటలు సులువుగా పాడుకొనేందుకండీ.ముఖ్యంగా పిల్లల కోసం చాలావరకు. పూవులు ఎలా మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయో, పూవులకు సంబంధించిన పాటలూ అలాగే మానసికోల్లాసం‌ కలిగిస్తాయి. అందుచేత ఏమీ‌ క్లేశం లేని హాయిగొలిపే శైలిలో ఉంటాయి ఈ‌ పాటలు. మీకు నచ్చినందుకు మరో‌సారి ధన్యవాదాలండీ.

      తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?