పూలతీగ
పువ్వులూ నవ్వులూ ఇష్టం లేని వాళ్ళుంటారా? అందుకే హాయిగా అన్నీ నవ్వుతూ మాట్లాడేసుకుందాం. సరేనా?
ఆదివారం, డిసెంబర్ 27, 2015
తెలతెలవారే చల్లని వేళ ఒక మందారం వికసించినది
తెలతెలవారే
చల్లని వేళ
బిలబిలాక్షుల
గడబిడ వేళ
తలుపులు తెరచి
ఇలు వాకిళుల
లలనలు ముగ్గులు
పరచే వేళ
ఒక ఊరిలో
ఒక వాడలో
ఒక తోటలో
ఒక మూలన
ఒక కొమ్మపై
ఒక రెమ్మపై
ఒక మందారం
వికసించినది
ఆ పూవుదే
ఆ అందమూ
ఆనందమూ
ఆర్భాటమూ
ఆ తోటలో
ఆ పూవుతో
అ ఆమని
అరుదెంచినది
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)