గురువారం, డిసెంబర్ 17, 2015

ఓ సుమబాలా ఓ‌ సుమబాలా భ్రమరం కోసం వేచిన బాలా
ఓ సుమబాలా ఓ‌ సుమబాలా
భ్రమరం కోసం వేచిన బాలా

రారా భ్రమర సుందర
మంచి మధువు యిట నుందిర
అంటూ ఎందుకు తొందర
ఉన్నది పండుగ ముందర

భ్రమరనాదము వినబడగానే
నీ‌ తనువెల్ల పులకించేనే
అన్ని పూవులూ నీలాగుననే
అతని రాకకు వేచిన వేనే

భ్రమరనాదము ఓం కారమటే
భ్రమరసంగమం బ్రహ్మైక్యమటే
ఫలదీకరణం తపఃఫలమటే
భ్రమరమ్మిదిగో‌ కనుగొంటివటే8 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ. మీరు వచ్చినందుకూ, పాటని మెచ్చినందుకూ కూడా.

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి. చివరి చరణం అంటారా అదే క్లైమేక్స్ కదా! మీరు మెచ్చినందుకు ధన్యవాదాలండీ.

   తొలగించండి
 3. పూలతీగ గుబాళిస్తోంది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండీ మీకు నచ్చినందుకు.

   పూవులతో
   పూవుల రంగుల హంగులతో
   తావులతో
   తావులు నింగికి పొంగగను
   పూలతీగ గుబాళించును
   నేలతల్లి మురిసి చూచును.

   తొలగించండి
 4. కవితలు జాలువారుతున్నాయి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును కదండీ. ధన్యవాదాలండీ.

   నేలమీద పూలతీగ పూవులు రాల్చు
   బ్లాగులోని పూలతీగ కవితలు రాల్చు

   అంతే‌ కదండీ.

   తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?