శుక్రవారం, డిసెంబర్ 04, 2015

ఆనందం‌ నాదేలే.....
నాదేలే ఈ‌ఉదయం
     ఉదయం....
నాదే సాయం సమయం
    నాదే సాయం సమయం

నాదేలే ఈ‌ ఉభయసంధ్యల
    నడుమన తిరిగే‌కాలం
    నడుమన తిరిగే‌కాలం
రెండిటి
    నడుమన తిరిగే‌కాలం


తెలతెలవారే వేళకు వచ్చే
    తొలికిరణాలను తీసుకు వచ్చే
పూలబాలల ఘుమఘుమల
    పలకరింపులు నావేలే
పలకరింపులు నావేలే
    పులకరింతలు నావేలే
నులివెచ్చని తొలికిరణాల
    పులకరింతలు నావేలే
ఉదయోత్సవమూ
    హృదయానందం నాదేలే
ఆ..హా హా..హా హా...
    హృదయానందం నాదేలే
............ నాదేలే॥

రంగురంగుల దుస్తులేసుకొని
    నింగికి రంగులు పులిమే‌మబ్బుల
సింగారాలు నావేలే
    మబ్బుల హంగులు రంగులు నావేలే
బంగరు సంధ్యా నాదేలే
     నింగిని హంగులు నావేలే
నింగిపైన ఆ
    రంగుల పొంగులు నావేలే
రంగురంగుల మబ్బుల చాటున
    బంగరు జాబిలి నాదేలే
నింగిని పొడిచే లేలేత
    బంగరు జాబిలి నాదేలే
అ..హా హా..హా...హా...
    హృదయానందం‌ నాదేలే
............ నాదేలే॥ 


చిరుచిరు నవ్వుల తామరల
    చెలువా లన్నీ‌ నావేలే
గడుసరి
    చెలువా లన్నీ‌ నా వేలే
కలువమిటారుల పరువాల
    కళకళ లన్నీ‌ నావేలే
సొగసరి
    కళకళ లన్నీ‌ నావేలే
వెలుగుల ముంచే సూరీడూ
    జిలిబిలి వెలుగుల జాబిల్లీ
వెలుగులిచ్చేది నాకేలే
    పలకరించేది నన్నేలే
అ..హా హా..హా...హా...
    హృదయానందం‌ నాదేలే
............ నాదేలే॥


4 కామెంట్‌లు:

 1. ఏం పోలేదండి ...
  అందుకే రెండు ముక్కలు ...

  మల్లె పూలు మల్లె పూలు పాట
  సూపర్ ... ఏ చిత్రం లోనిదండీ...
  మునుపు ఎపుడూ వినలేదు.

  ఉదయం సాయం సమయం
  హృదయానందం మాదీలే ...
  :-)

  రిప్లయితొలగించండి
 2. స్వాగతం రావు గారూ,

  మల్లెపూలు, మల్లెపూలు - మల్లెపూలు కావాలా? అన్న పాట రాజీ నా ప్రాణం (1954) సినిమా లోని దండీ. ఈ పాటను పాడింది. తొలితరం సినీగాయనియే కాదు తెలుగు సినిమాకు మొట్టమొదటి నేపథ్యగాయని రావు బాలసరస్వతి గారు.

  ఈ పాట మీకు యూ-ట్యూబ్‍లో దొరుకుతుందండి. మీ మరియు ఇతర పాఠకుల సౌకర్యం కోసం దాని లింకు ఇస్తున్నాను వినండి మల్లెపూలు మల్లెపూలు పాట .

  మీ లాంటి సహృదయులైన పాఠకుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి మంచి పాటలూ కథలూ కబుర్లూ వస్తాయండి. లేకుంటే ఈ పూలతీగ వాడిపోతుందండి. మరి ఆపైన, మీ ఆదరణ - ఈ పూలతీగ ప్రాప్తం.

  ఉంటానండి.

  రిప్లయితొలగించండి
 3. స్వాగత సత్కారాలకు ఆనంద మహదానందం ...
  గానం ఎన్నెన్ని సార్లు వింటే అన్నన్ని సార్లు ఆనందం ...
  గీత పరిచయ ప్రాప్త భాగ్యానికి వినమ్ర వందనం ...
  ఇంచక్కని పాటలు ఎంచక్కా మాతో ఇంకా ఇంకా
  కూని రాగాలుగా కూయిస్తారని ఆశిస్తూ ...

  regards ...

  రిప్లయితొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?