సోమవారం, డిసెంబర్ 07, 2015

నునులేత చివురు రెమ్మల - కనువిందు పూల బాలలం

నునులేత చివురు రెమ్మల
కనువిందు పూల బాలలం
..  ..  ..  ..  ..   నునులేత

ఉదారవర్ణ రంజితం
మృదులదళవిశోభితం
ఉదరాన మధురమధురసం
ఉదయాస్తమాన జీవితం
..  ..  ..  ..  ..   నునులేత

చిగురాకు మాకు చుట్టము
చిరుగాలి మాకు నేస్తము
విరితేనెలాను భ్రమరము
నిరుపేదతనము ఫలితము
..  ..  ..  ..  ..   నునులేత

మా సోయగాలు క్షణికము
మా పరిమళాలు క్షణికము
మా సంతసాలు క్షణికము
మా జీవితాలె క్షణికము
..  ..  ..  ..  ..   నునులేత


6 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. మీకు నచ్చేసిందన్నమాట. చాలా సంతోష మండీ. ఇంగ్లీషులో చెప్పినా పూలతీగకు తెలుస్తుంది లెండి, ఎంత తెలుగింటి పూలతీగైనా చుట్టు జనం అంతా ఈ‌ ఇంగ్లీషు కలేసి కొట్టి కాని ఒక్కముక్కా మాట్లాడటం లేదు కదా ఈ‌మధ్య కాలంలో. అందుకని అన్నమాట.

   మీ‌ పేరేమిటో‌చెప్పరూ? పోన్లెండి మీ‌యిష్టం మీదీ, దానికేం.

   చదినినందుకూ, మెచ్చినందుకూ బోలెడు బోలెడు ధన్యవాదాలండీ.

   తొలగించండి
 2. మేడం గారు...
  అన్యధా భావించకండి. మొదటి లైన్ లో రెమ్మలం
  పొరపాటుగా రెమ్మల గా టైపు అయిందేమోనని
  నా సందేహం. పొరపాటు నాదయితే పెద్ద మనసు
  చేసుకోండి.
  మీ రచనలు బాలానందంగా, బహు ఆనందంగా
  ఉంటున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. " నునులేత చివురు రెమ్మల - కనువిందు పూల బాలలం "
   ఇక్కడ రెమ్మల అన్నది సరిగానే ఉందండీ. రెమ్మల అంటే రెమ్మలకు చెందిన అని అండి. ఒక ఉదాహరణ ఇస్తాను.

   "ఆ వీధిలో ఇళ్ళ డాబాలన్నీ ఇలాగే ఉంటాయి." అన్న వాక్యంలో తప్పు ఉందాండీ? లేదు కదా. ఇక్క ఇళ్ళ అన్నది ఇళ్ళ యొక్క అని షష్ఠీ విభక్తి అన్నమాట. తెలుగులో‌ ఈ షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వదిలివేసి చెప్పటమే వాడుక. యొక్క అన్న ప్రత్యయం‌ శుధ్ధదండుగ మారి అన్నమాట. నిత్యజీవితంలో మనం యెక్క అన్నది చెప్పం కదా? ఆలోచించండి.

   మీకు ఈ‌ పూలతీగ పాటలు నచ్చుతున్నందుకు బోలెడంత సంబరంగా ఉందండి. అందుకే మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలండీ.

   తొలగించండి
  2. నిజాయితీగా ఒక విషయం చెబుతాను.
   నాకు పెద్దగా భాష పై పట్టు లేదు. కేవలం
   పద, భావాల కూర్పరిని మాత్రమే.
   నేను పైన రెమ్మలం అన్నదాన్ని రెమ్మల
   పదం తప్పన్న ఉద్దేశ్యం తో గాక మొదటి
   లైన్ తప్ప అన్ని పదాల చివర్న 'మ'
   శబ్దం రావడం తో మొదటి లైన్ లో అది
   మిస్సయిందేమోనన్న అపోహతో ...
   regards...

   తొలగించండి
  3. అపోహలు మనందరికీ ఉంటాయి కదండీ. మనవేఁ మన్నా భాషాప్రవీణలు చేసేసామా ఏమిటి. మీ కనుమానం వచ్చింది అడిగారు. ఏమీ‌ ఇబ్బంది లేదు.

   ఇకపోతే మీరు అంత్యప్రాస గురించి ప్రస్తావించారు కదా. అవునండీ. చరణాలన్నీ ప్రాస పాటించాయి (ఒకచోట తప్ప!). ఏ చరణానికది ఒక అంత్యప్రాసనూ‌ పాటించతమూ జరిగింది. పల్లవిలో అంత్యప్రాస ఇక్కడ లేదు కదా అందుచేత ఇక్కడా ఉండేదేమో అనుకున్నారన్న మాట. అబ్బే ఇక్కడ పల్లవిలో కుదరలేదండి. కాని పాడటానికి ఏమీ ఇబ్బంది రాదు లెండి.

   తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?